- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శారీలో పుత్తడి బొమ్మలా సమంత.. నిన్నిలా చూసి ఎన్నాళ్లు అయింది సామ్ అంటూ ఫుల్ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం నిర్మాతగా మారి ‘శుభం’ (shubham)సినిమాను తన సొంత ట్రాలాలా మూవీస్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్ని సూపర్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. కాగా ఈ చిత్రం మే 9న థియేటర్స్‌లో విడుదల అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా సమంత ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో ఎల్లో కలర్ శారీ కట్టుకుని స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపించింది. ఇక దీనికి ‘ఎందుకో బాగుంది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన సమంత ఫ్యాన్స్ నిన్నుఇలా హ్యాపీగా చూసి ఎన్నాళ్లు అయింది సామ్ అంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.