Samantha: ఒక్కో ఫొటోకు ఒక్కో క్యాప్షనిచ్చి సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..

by Kodari Anjali |

టాలీవుడ్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Samantha: ఒక్కో ఫొటోకు ఒక్కో క్యాప్షనిచ్చి సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్‌లోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని.. స్టార్ డమ్ సంపాదించుకుంది. ఏమాయ చేసావే చిత్రంతో సామ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ బ్యూటీ బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది వంటి చిత్రాల్లో అవకాశం దక్కించుకుని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అవకాశం కొట్టేసింది.

మరోపక్క తమిళంలో కూడా సామ్ గుర్తింపు సాధించింది. సమంత ఆపై అంజాన్, కత్తి వంటి సినిమాలతో ప్రముఖ కథానాయికగా ఎదిగింది. 2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ.. ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత గుర్తింపు దక్కించుకుంది. సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌లో రాజీ పాత్రను పోషించి ఉత్తమ నటిగా పేరు గాంచింది.

ఇకపోతే తాజాగా బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. ఒక్కో ఫొటోకు ఒక్కో క్యాప్షన్ ఇచ్చింది. ‘‘మీరే చెప్పండి అని ఒక ఫొటోకు క్యాప్షన్ జత చేయగా.. నేను స్థిరంగా, ప్రశాంతంగా, నియంత్రణలో ఉన్నాను అని మరోక దాంట్లో రాసుకొచ్చింది. అలాగే నేను విషయాలను గుర్తించడానకి నన్ను విశ్వసిస్తున్నాను, నేను పరిపూర్ణత కంటే పురోగతిని ఎంచుకుంటాను, నేను నియంత్రించలేని వాటిని వదులుతాను, నేను చేయగలిగిన వాటిపై మాత్రమే ఫోకస్ చేస్తాను, ముఖ్యంగా నా శక్తి నాకు ముఖ్యం, నేను రోజు ఆత్మవిశ్వాసంతో కదులుతాను’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్ లేటెస్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story