సమంత బోల్డ్ ఫోటోల‌పై ట్రోలింగ్!

by velandi.Saikiran |

సమంత బోల్డ్ ఫోటోల‌పై ట్రోలింగ్ జ‌రుగుతోంది.

సమంత బోల్డ్ ఫోటోల‌పై ట్రోలింగ్!
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సమంత.. దాదాపు 16 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గానే కొనసాగుతున్నారు. ఆమె ఏజ్ పైబడినా, క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అయితే అలాంటి హీరోయిన్ సమంత తాజాగా కాస్త బోల్డ్ గెటప్ లో కనిపించారు. ప్రైవేట్ అందాలు కనిపించేలా డ్రెస్ ధరించి మెరిశారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే దీనిపై నెటిజెన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

రెండో పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ సమంత పొట్టి బట్టల్లో నిత్యం కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందు సమంత కాస్త పద్ధతిగా కనిపించేదని... కానీ ఇప్పుడు లిమిట్స్ దాటి వ్యవహరిస్తుందని సెటైర్లు పేల్చుతున్నారు. సమంత అంటే తెలుగు అమ్మాయిలా చూడాలని అనుకుంటున్నాం.. కానీ ఇలా బోల్డ్ గా చూడలేక‌పోతున్నామ‌ని కామెంట్స్ చేస్తున్నారు. అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం.. ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఓ స్టార్ హీరోయిన్ అన్నాక కొన్ని లిమిట్స్ దాటాల్సిందేనని పేర్కొంటున్నారు. కాగా అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సమంత.. ఇటీవల రాజ్ నిడి మోర్ ను రెండో పెళ్లి చేసుకుంది.

Next Story