- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమంత హీరోయిన్‌గా కొత్త సినిమా షురు.. డైరెక్టర్ ఎవరంటే?
‘యశోద’, ‘శాకుంతలం’, ‘ఖుషి’ వంటి సినిమాల తర్వాత సమంత.. హీరోయిన్‌గా మరో మూవీ చేయలేదు.

దిశ, సినిమా: ‘యశోద’, ‘శాకుంతలం’, ‘ఖుషి’ వంటి సినిమాల తర్వాత సమంత.. హీరోయిన్‌గా మరో మూవీ చేయలేదు. మయోసైటిస్ కారణంగా ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చిన సామ్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో నిర్మాతగా మారి సక్సెస్ అందుకుంది. ఈ మేరకు ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసి రీసెంట్‌గా ‘శుభం’ అనే సినిమాను నిర్మించి సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సమంత కూడా ఓ కీ రోల్‌లో కనిపించి మెప్పించింది. అయితే.. సమంత ఫ్యాన్స్ మాత్రం తను మళ్లీ హీరోయిన్‌గా ఎప్పుడు ఫామ్‌లోకి వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే సామ్ బ్యూటీ నెక్ట్స్ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మేరకు సామ్.. తెలుగు సినిమా రంగంలోకి కమ్ ఇచ్చినట్లు టాక్. ఆమె సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ & డికె రచనతో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే ఈ మూవీలో సామ్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు టాక్. జబర్దస్త్ & ఓ బేబీ తర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో మరోసారి సమంత చిత్రం చేయబోతుందని తెలుస్తుండగా.. ప్రజెంట్ ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా దీనిపై పూర్తి వివరాలు త్వరలో రానున్నట్లు సమాచారం.






