- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ladies and gents: సినీ ఇండస్ట్రీలో కొత్త చరిత్రకు నాంది పలుకుతున్న సమంత.. రాజమౌళి కూడా చేయలేదు కదా..!
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గతేడాది ‘సిటడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్(Web series)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గతేడాది ‘సిటడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్(Web series)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ స్పై థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోగా నటించగా.. రాజ్ అండ్ డీకే (Raj and DK) దీనికి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సిరీస్ అనుకున్నంత ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ప్రజెంట్ ఈ సరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే.. స్టార్ బ్యూటీ సమంత, స్టార్ దర్శకురాలు నందినిరెడ్డి (Nandini Reddy) మరోసారి జతకడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో సమంత, నందిని రెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. సమంత సొంత ప్రోడక్షన్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు టాక్. అంతే కాకుండా ఈ మూవీ రీమేక్ కాకుండా ఒరిజినల్ స్క్రిప్ట్ (Original script)తో తెరకెక్కనుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందిని రెడ్డి ఈ విషయాలను చెప్పుకొచ్చింది. ఇక దీంతో పాటు.. సమంత నిర్మాణంలో వచ్చే ఈ సినిమాకు ‘బంగారం’ (Bangaram) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు, ఇందులో పనిచేసే పురుషులు అండ్ మహిళలకు సమాన వేతనం కల్పిస్తానని సమంత చెప్పినట్లు కూడా నందిని రెడ్డి తెలిపింది. ప్రజెంట్ నందిని రెడ్డి కామెంట్స్ వైరల్ అవుతుండగా.. పురుషులు అండ్ మహిళలకు సమాన వేతనం ఇవ్వాలనే సమంత వ్యక్తిత్వంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ నిర్మాణ సంస్థ, హీరో, దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి సాహస నిర్ణయం తీసుకోలేదు. కానీ సమంత ఈ డెసీషన్ తీసుకోవడంతో టాలీవుడ్ పరిశ్రమకు ఆమెను ప్రశంసల్లో ముంచేస్తోంది.






