- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha: హాలీవుడ్ మోడల్‌గా మేకోవర్ అయిన సమంత.. భారీ ప్లానే వేసిందిగా!
టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha) తాజాగా ఓ కొత్త లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది.

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha) తాజాగా ఓ కొత్త లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో సమంత ఓవరల్ లుక్ (Overall look) మొత్తం చేంజ్ అయిపోయింది. హాలీవుడ్ మోడల్ (Hollywood model)గా మేకోవర్ అయింది. అయితే.. ప్రముఖ మ్యాగజైన్ (magazine) కోసం సమంత ఈ ఫొటో షూట్ చేసినట్టు తెలుస్తుండగా.. ఈ న్యూ ట్రెండీ ఫొటోలు (New trendy photos) సోషల్ మీడియా (Social media)లో వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరు సామ్ లుక్‌కు ఫిదా అవుతున్నారు. మరికొందరు మాత్రం ‘మాకు పాత సమంత కావాలి.. ఏ మాయ చేసావె సినిమాలో ఉన్న ఆ అమాయకపు, అందమైన సమంత కావాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఫొటోస్‌పై మరో బజ్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ హీరోయిన్ త్వరలో ఓ హాలీవుడ్ మూవీ (Hollywood movie)లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. ఈ న్యూ మేకోవర్ హాలీవుడ్ చిత్రం కోసమే అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తు్న్నారు. కాగా.. ఇటీవల సమంత ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్ (spy action thriller) వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించాడు. గతేడాది రిలీజైన ఈ సిరీస్‌లో యాక్షన్ సీన్స్‌తో అదరగొడుతూను మదర్ క్యారెక్టర్‌లో ఎమోషనల్ అండ్ సెంటిమెంట్‌తో అభిమానులు ఆకట్టుకుంది. అంతే కాకుండా.. రొమాంటిక్ సీన్స్‌తోనూ యూత్‌ను మెస్మరైజ్ చేసింది.






