Samantha: లవ్ సింబల్ జోడించి అగ్ర తార సమంత తాజా పోస్ట్.. ఆకట్టుకుంటోన్న ఫొటో

by Kodari Anjali |   (  Updated:2025-03-09 15:37:30  IST  )

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత (Samantha) తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్ని అలరిస్తుంటుంది.

Samantha: లవ్ సింబల్ జోడించి అగ్ర తార సమంత తాజా పోస్ట్.. ఆకట్టుకుంటోన్న ఫొటో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత (Samantha) తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. ఈ భామకు కుర్రాళ్లు మాత్రమే కాకుండా.. లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ నటి మంచి పేరు దక్కించుకుంది. అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది.

కెరీర్ మొదట్లోనే సమంత అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. ఏమాయ చేసావే చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా ఈ బ్యూటిఫుల్ నటి తర్వాత అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. రెండ్రోజుల కిందటే ఈ అమ్మడు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Walkitlo Sirimalle Chettu) చిత్రం థియేటర్లలో మళ్లీ విడుదలై మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

అత్తారింటికి దారేది (Attarintiki Daredi), ఎటో వెళ్లిపోయింది మనసు, ఆటోనగర్ సూర్య (Autonagar Surya), యశోద, జాను, ఓ బేబీ, ఖుషీ (Khushi) వంటి సినిమాల్లో నటించి సమంత ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈమె కేవలం సినిమాల్లోనే కాకుండా.. వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించి తన సత్తా చాటుతుంది.

ఇకపోతే తాజాగా సమంత సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్ లో తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. అభిమానుల్ని అలరిస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా సామ్ ఇన్‌స్టా స్టోరీగా.. ‘‘ తాజా పోస్ట్‌పై మీ అందరి హృదయపూర్వక వ్యాఖ్యల కోసం’’ అంటూ రెడ్ కలర్ లవ్ సింబల్ జోడించి రాసుకొచ్చింది. సమంత ఫొటో కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ నటి ఇన్‌స్టా స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

READ MORE ...

Rakul: ‘జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఇలాగే అనిపిస్తుంది’: టాలీవుడ్ హీరోయిన్

Next Story