Samantha: అద్భుతమైన రాతలతో మహిళలకు ఉమెన్స్ డే విష్ చేసిన సమంత

by Kodari Anjali |

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Samantha: అద్భుతమైన రాతలతో మహిళలకు ఉమెన్స్ డే విష్ చేసిన సమంత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఏమాయ చేసావే (emaya chesave) చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సామ్ మంచి స్థాయిలో ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు, సూర్య వంటి హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని.. తనలోని సత్తాను చాటింది. కేవలం సినిమాల్లోనే కాకుండా.. ఈ హీరోయిన్ వెబ్ సిరీస్‌ల్లో, ఐటెమ్ సాంగ్స్‌లో కూడా మెరిసింది.

పుష్ప మొదటి పార్ట్‌లో సామ్ వేసిన స్టెప్పులు యువతను ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. రీసెంట్‌గా సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌కు ఐకానిక్ గోల్డ్ అవార్డు (Iconic Gold Award) వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఈ సిరీస్ దర్శకుడు సోషల్ మీడియా వేదికన పంచుకున్నాడు.

సమంత కూడా సోషల్ మీడియా వేదికన ధన్యవాదాలు చెప్పుకొచ్చింది. ఈ అద్భుతమైన నటి ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఇప్పటికే ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన విషయం తెలిసిందే. అతితక్కువ సమయంలోనే సమంత స్టార్ డమ్ సంపాదించుకుంది. కెరీర్ మొదట్లోనే ఈ బ్యూటీ అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ఎటో వెళ్లిపోయింది మనసు, సమ్‌థింగ్ సమ్‌థింగ్ (Something Something), ఆటోనగర్ సూర్య, ఓ బేబీ, ఖుషీ, జాను, యశోద వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసకుంది. అయితే నేడు మహిళా దినోత్సవం (women's day

) సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికన విషెష్ చెబుతోన్న విషయం తెలిసిందే.

కాగా తాజాగా సమంత కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అద్భుతంగా రాసుకొచ్చింది. ‘తుఫానులను దయతో నావిగేట్ చేసేది. ప్రపంచాన్ని తన నిశ్శబ్ద కౌగిలిలో పట్టుకున్నది. అడుగడుగునా కలలను బ్యాలెన్స్ చేసేది, ఊపిరి పీల్చుకున్నప్పుడు కూడా పైకి లేచేది. తిరిగి అడగకుండా ఇచ్చేది, ఆవేశంతో రగిలిపోయేది,

ఇంకా ఆరాటపడుతూనే ఉంటుంది, భారాలు, కాంతి రెండింటినీ మోసే ఆమె, చీకటి రాత్రిలో కూడా ప్రకాశించేది. అవన్నీ చేసేది, తప్పిపోకుండా చేసేది, తను ఎదుర్కొన్న ప్రతి సవాల్‌కి హృదయం ఆమె, కనిపించనప్పటికీ, ప్రపంచాన్ని తిప్పికొట్టేది, ఆమె తన శక్తితో ఎప్పుడూ మండుతూనే ఉంటుంది’ అని సమంత రాసుకొచ్చింది. చివర్లో హ్యాపీ ఉమెన్స్ అని విషెష్ చెప్పుకొచ్చింది.

Next Story