‘ఇది నా సంతోషకరమైన సమయం’: అగ్ర తార సమంత

by Kodari Anjali |   (  Updated:2025-06-09 13:18:01  IST  )

టాలీవుడ్ అగ్ర తార.. బ్యూటిఫుల్ హీరోయిన్.. యూత్ ఆల్‌టైమ్ ఫేవరెట్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘ఇది నా సంతోషకరమైన సమయం’: అగ్ర తార సమంత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర తార.. బ్యూటిఫుల్ హీరోయిన్.. యూత్ ఆల్‌టైమ్ ఫేవరెట్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఏ ముహూర్తాన తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ.. కెరీర్ స్టార్టింగ్‌లోనే వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అనేక చిత్రాల్లో అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి.. స్టార్ డమ్ సంపాదించుకుంది. అయితే సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తూ.. తనదైన టాలెంట్‌తో ప్రేక్షకుల్ని నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

రీసెంట్‌గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన శుభం సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సమంత నిర్మాతగా వ్యవహరించింది. తొలి నిర్మాతగా సామ్‌కు ఇదే మొదటి చిత్రం. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో సమంత ముఖంలో సంతోషం కనిపించింది. దీంతో ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో వరుస పోస్టులతో ఈ నటిని ముంచెత్తారు. ఇక నెటిజన్లలో సమంత క్రేజ్ ఎప్పటికీ తగ్గదని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

సామ్ మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పటి నుంచి హెల్త్ పై మరింత ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ ముద్దుగుమ్మ రోజు హెల్తీ ఫుడ్ తీసుకోవడమే కాకుండా.. జిమ్‌లో కూడా భారీ వర్కౌట్స్ చేస్తుంటుంది. తాజాగా సమంత జిమ్‌లో చెమటలు చిందిస్తోన్న ఓ వీడియో పంచుకుంది. ఈ వీడియోకు ‘‘మానసిక స్థితి ఏదైనా ఒక కదలికను కనుగొనండి’’. అని ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. అలాగే వీడియోలో కనిపిస్తోన్న జిమ్‌ గోడలకు కొన్ని పలు మాటలు రాసి ఉన్నాయి. ‘ఇది నా సంతోషకరమైన సమయం, ఒక వ్యాయామంతో మీ శరీరాన్ని నిర్మించుకోండి.’ అని ఉన్నాయి.

Next Story