- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha:‘దాచడానికి ఏమీ లేదు.. ఇదే ఉద్దేశ్యంతో మొదలవుతుంది’.. సమంత పోస్ట్ వెనక అర్థమేంటి?
సినీ ఇండస్ట్రీలో అండ్ ప్రజల్లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత క్రేజ్ అంతా ఇంతా కాదు.

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో అండ్ ప్రజల్లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు సినిమాలు హిట్, ప్లాప్ ఏ టాక్ సొంతం చేసుకున్నా.. ఆల్ సమంత ఫ్యాన్స్‌మే అని చెప్పుకున కుర్రాళ్లతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ అమ్మడు తెలుగులో అనేక సినిమాల్లో నటించి.. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తన అందం, నటన, అభినయం, అమాయకత్వం, డ్యాన్స్‌తో మెప్పించిందనడంలో అతిశయోక్తిలేదు.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి.. స్టార్ డమ్ సంపాదించుకుంది. ఒక సంవత్సరం మయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ సినిమాల బాట పట్టిన సమంత సినిమాల్లో కాకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ.. తన సత్తా చాటుతోంది. ఇప్పటికే తను నటించిన సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
ఇటీవలే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాగా శుభం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సమంత క్రేజ్ సినీ పరిశ్రమలో మరింత పెరిగిపోయింది. అటు సామ్ సినిమాల్లో కీలక రోల్స్ పోషిస్తూ.. ఇటు నిర్మాతగా మారి తనలోని ప్రతిభను బయటపెడుతోంది. ఇకపోతే సమంత తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఇది ఉద్దేశ్యంతో ప్రారంభమవుతుంది. దాచడానికి ఏమీ లేదు.. @secret.alchemist’’ అని రాసుకొచ్చింది.






