- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విడదీయరాని బంధం’ అంటూ అగ్రతార సమంత పోస్ట్.. ఎవరి గురించి పెట్టిందంటే..?
టాలీవుడ్ అగ్రతార సమంత తరచూ సోషల్ మీడియాలోని అభిమానులతో టచ్‌లో ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్రతార సమంత తరచూ సోషల్ మీడియాలోని అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో నెటిజన్లను అలరిస్తుంటుంది. ఇకపోతే సమంత ఇప్పటికి సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి పదిహేను ఏళ్లు అవుతుందన్న విషయం తెలిసిందే. కాగా ఈ నడుమ సామ్ అనేక అవార్డులు సొంతం చేసుకుంది. అలాగే సమంత రూత్ ప్రభుకు రీసెంట్‌గా సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో ఆమె నటనకు గాను ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. అలాగే సినీ పరిశ్రమలో 15 సంవత్సరాల అనుభవం పూర్తి చేసుకున్నందుకు గాను ఆమెను సత్కరించారు.
జీ తెలుగు ఛానల్ నిర్వహించిన ఒక అవార్డు ఫంక్షన్‌లో సమంతకు ఈ పురస్కారాన్ని అందించారు. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్‌కు ఉత్తమ నటిగా అవార్డు రావడంతో సోషల్ మీడియా వేదికన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపోతే సమంత ప్రస్తుతం నిర్మాతగా మారి తనలోని మరో టాలెంట్ బయటపెడుతోన్న విషయం తెలిసిందే. నిర్మాతగా మొదటి సినిమా శుభంను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ మూవీకి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే.. సమంత తాజాగా కుక్క అండ్ పిల్లి ఫొటో పంచుకుని ఇన్‌స్టా స్టోరీలో ‘విడదీయరానివి’ అని రాసుకురాగా.. అలాగే ‘విస్తృతంగా మేల్కొని కలలు కనడం’ ఓ క్యాప్షన్ రాసుకొచ్చి.. పోస్ట్ పెట్టింది. ఈ పోస్టులో పలు ఫొటోలు కూడా పంచుకుంది.






