- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha: తనను తాను ఎలా గైడ్ చేసుకుంటుందో వివరించిన సమంత.. బర్త్ డే సందర్భంగా నటి ఇన్స్పిరేషన్ పోస్ట్ వైరల్
1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించిన బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత, చిన్ననాటి నుంచే చదువులో తెలివితేటలు కనబర్చింది.

దిశ, వెబ్‌డెస్క్: 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించిన బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత, చిన్ననాటి నుంచే చదువులో తెలివితేటలు కనబర్చింది. మోడలింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. నటన పట్ల ఉన్న ఆసక్తితో సినిమా రంగంలో అడుగుపెట్టి.. సినీ ఇండస్ట్రీలో అండ్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తన అద్భుతమైన నటనతో జనాల్ని ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ నటనకు కోట్లలో అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు.
కెరీర్ మొట్లోనే బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది. ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుని స్టార్ డమ్ తెచ్చుకుంది. ఇకపోతే నేడు (ఏప్రిల్ 28) ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా అనేక మంది అభిమానులు, ప్రముఖ సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికన పుట్టిన రోజు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఓ అభిమాని మూడేళ్ల కిందట ఏకంగా సామ్ కు గుడి కట్టించిన విషయం తెలిసిందే.
చాలా మంది అభిమానులు తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడి కట్టిస్తారన్న విషయం తెలిసిందే. మూడు సంవత్సరాల కిందన బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్ అనే ఓ వ్యక్తి సమంతకు గుడి కట్టి తన అభిమానాన్ని చాటారు. ఇక నేడు ఈ నటి బర్త్ డే సందర్భంగా గత మూడేళ్లుగా ఈ హీరోయిన్ బర్త్ డే ను సెలబ్రేట్ చేస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్నానని నేడు సందీప్ వివరించారు. సామ్ వందేళ్లు హ్యాపీగా బతకాలని తెలిపారు. ఇదంతా పక్కన పెడితే..
సామ్ ఏప్రిల్ మెమోరీస్ అంటూ నెట్టింట ఓ పోస్ట్ పంచుకుంది. ఇందులో ఒకటి మీరే ఎలా గైడ్ చేసుకుంటారు? అని ప్రశ్న ఉండగా.. దానికి సామ్ ఇలా సమాధానమిచ్చింది. మీ కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీరు ఎల్లప్పుడూ మీలో ఉండే మూడు మార్గదర్శకాలను కనుగొంటారు. మీ అంతర్ దృష్టి, మీ విలువలు అండ్ మీ నాడీ వ్యవస్థ. వారి సత్యాన్ని అనుభూతి చెందండి. అది ముందుకు వెళ్లే మార్గాన్ని స్పష్టం చేస్తుంది. మీ కంటే మీకు బాగా తెలుసునని మీరు విశ్వసించాలి.’’ అని సమంత వెల్లడించింది. పుట్టిన రోజు సందర్భంగా సమంత తెలిపిన ఇన్స్పిరేషన్ వర్డ్స్ జనాల్ని మోటివేట్ చేస్తున్నాయి.






