Samantha: సమంత పోస్ట్.. ఖచ్చితంగా అవి అసూయపడుతాయంటూ నెటిజన్ల కామెంట్లు

by Kodari Anjali |   (  Updated:2025-04-26 13:27:31  IST  )

సినీ ఇండస్ట్రీలో అండ్ తెలుగు ప్రజల్లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత క్రేజ్ అంతా ఇంతా కాదు.

Samantha: సమంత పోస్ట్..  ఖచ్చితంగా అవి అసూయపడుతాయంటూ నెటిజన్ల కామెంట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో అండ్ తెలుగు ప్రజల్లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు సినిమాలు హిట్, ప్లాప్ ఏ టాక్ సొంతం చేసుకున్నా.. ఆల్ టైమ్ సమంత ఫ్యాన్స్ అని చెప్పుకునే కుర్రాళ్లతో సహా అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ అమ్మడు తెలుగులో అనేక నటించి.. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తన అందం, నటన, అభినయం, అమాయకత్వం, డ్యాన్స్‌తో మెప్పించిందనడంలో అతిశయోక్తిలేదు.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి.. స్టార్ డమ్ సంపాదించుకుంది. ఒక సంవత్సరం మయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ సినిమాల బాట పట్టిన సమంత సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఇప్పటికే తను నటించిన సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. బ్లూ కలర్ స్టైలిష్ డ్రెస్ ధరించి.. స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలకు బ్లూ కలర్ లవ్ సింబల్ జోడించి అభిమానులతో పంచుకోగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వారం పుట్టినరోజు కాగా ఫేస్ వెలిగిపోతుంది, ఓరి దేవుడా.. సూపర్.. ఖచ్చితంగా నీలిరంగు పువ్వులు అసూయపడుతాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story