- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తతో సమంత హ్యాపీ మూడ్.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
న్యూ ఇయర్‌లో భర్తతో సమంత హ్యాపీ మూడ్‌లో ఉన్న లిస్బన్ వీడియో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇక అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడి అతన్నే మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత రీసెంట్‌గా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో పెళ్లిపీటలెక్కింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది.
ఇక మ్యారేజ్ తర్వాత మళ్లీ తమ ప్రొఫెషనల్ వర్క్స్‌లో బిజీ అయిపోయింది సమంత. ‘శుభం’(Shubham) సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు కూడా సామ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య, దివంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సామ్- రాజ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఈ జంట కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు పోర్చుగల్ రాజధాని లిస్బన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. సమంత ఎంతో ఆనందంగా, నవ్వుతూ కనిపించింది. అలాగే భర్త రాజ్ ఆమెను సెలబ్రేషన్స్ కోసం బయట నుంచి రూమ్‌కి తీసుకెళ్లిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలా ఈ జంట కలిసి కొత్త ఏడాదిని గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పిన తీరు అభిమానులను ఫిదా చేస్తోంది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. సామ్ ఇలా హ్యాపీగా ఉండటం చాలా ఆనందంగా ఉందని, నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.






