సమంత స్పీచ్.. అదరగొట్టావ్.. అమల అక్కినేని క్లాప్స్.. క్యూట్ రియాక్షన్.. ఒకే స్టేజీపై ఇద్దరు.. వైరల్ వీడియో

by Sujitha Rachapalli |

బ్యూటిఫుల్ సమంత కెరీర్‌లో దూసుకుపోతుంది. పర్సనల్ లైఫ్‌లో కాస్త ఫెయిల్ అయిన బ్యూటీ రీల్ లైఫ్‌లో మాత్రం సక్సెస్‌ఫుల్‌ జర్నీ కొనసాగిస్తోంది. రీసెంట్‌గా ‘శుభం’ సినిమాతో నిర్మాతగా కూడా మారిన ఆమె న్యూ టాలెంట్స్‌ను

సమంత స్పీచ్.. అదరగొట్టావ్.. అమల అక్కినేని క్లాప్స్.. క్యూట్ రియాక్షన్.. ఒకే స్టేజీపై ఇద్దరు.. వైరల్ వీడియో
X

దిశ, ఫీచర్స్ : బ్యూటిఫుల్ సమంత కెరీర్‌లో దూసుకుపోతుంది. పర్సనల్ లైఫ్‌లో కాస్త ఫెయిల్ అయిన బ్యూటీ రీల్ లైఫ్‌లో మాత్రం సక్సెస్‌ఫుల్‌ జర్నీ కొనసాగిస్తోంది. రీసెంట్‌గా ‘శుభం’ సినిమాతో నిర్మాతగా కూడా మారిన ఆమె న్యూ టాలెంట్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తానని తెలిపింది. మొత్తానికి సినిమా పరిశ్రమలో 15ఏళ్లు పూర్తి చేసుకున్న ఆమెకు ఫ్యాన్స్ ఇప్పటికే విష్ చేశారు. ఈ సందర్భంగా తాజాగా ఓ టీవీ కార్యక్రమం సన్మానించింది. ఈ క్రమంలో థాంక్‌ఫుల్ స్పీచ్ ఇచ్చింది సామ్.

‘తెలుగు ఇండస్ట్రీ నాకు అన్నీ ఇచ్చింది. తెలుగు ఆడియన్స్‌కే నా ఇంపార్టెన్స్. థాంక్యూ’ అని చెప్పింది. కెరీర్‌ను ఇంత విజయవంతంగా మార్చినందుకు ముఖ్యంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. ఈ కార్యక్రమానికి అమల అక్కినేని కూడా హాజరైంది. సామ్ స్పీచ్ అదరగొట్టగా.. క్లాప్స్‌తో క్యూట్ రియాక్షన్ ఇచ్చింది. కాగా సమంత, అమల ఒకే స్టేజీపై ఉండాలని కోరుకుంటున్నామని.. ఇందుకోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన సామ్ స్పీచ్ అదరగొట్టిందని రియాక్ట్ అవుతున్నారు.

Next Story