హాట్ అండ్ స్టైలిష్ లుక్‌లో సమంత గ్లామర్ షో

by Pulgam srinivas |

టోటల్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో సమంత గ్లామరస్ లుక్ వైరల్.

హాట్ అండ్ స్టైలిష్ లుక్‌లో సమంత గ్లామర్ షో
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హాటెస్ట్ బ్యూటీ సమంత గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు ఎన్నో భాషల సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.




కెరీర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాల్లో నటించి తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల కాలంలో వైవిధ్యమైన పాత్రల వైపు అడుగులు వేస్తోంది. అలాగే సినిమాలను నిర్మించడంపైనా ఆసక్తి చూపిస్తోంది.




-కొంతకాలం క్రితం ‘శుభం’ అనే సినిమాను నిర్మించిన ఈమె, ప్రస్తుతం ‘మా ఇంటి మహాలక్ష్మి’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.




ఈ పిక్స్‌లో ఆమె బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తోంది. హ్యాండ్ బ్యాగ్, నల్లని ఇయర్ రింగ్స్, అలాగే నల్లని నెయిల్ పాలిష్‌తో తన లుక్‌ను మరింత హైలైట్ చేసింది.



ఆమె హెయిర్ స్టైల్ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మొత్తంగా టోటల్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో సమంత లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుండగా, ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Next Story