- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha:‘మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశా’.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించే పనిలో పడిపోయింది టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత.

దిశ, వెబ్‌డెస్క్: డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించే పనిలో పడిపోయింది టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత(Samantha). ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువ సమయంలో స్టార్ డమ్ సంపాదించుకుంది. దాదాపు ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లనే చెప్పుకోవచ్చు. ఇటీవలే సమంత నటించిన సిటాడెల్: హనీ బన్నీ(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)వేదికన విడుదలై మంచి విజయం సాధించింది. సామ్ తనలోని మరో కోణాన్ని బయటపెట్టి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ హీరోయిన్ రక్త్‌బ్రహ్మాండ్(RakhtBrahmand) అనే మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. రాహి అనిల్ బార్వే(Rahi Anil Barve) దర్శకత్వంలో వస్తోన్న ఈ వెబ్ సిరీస్ కోసం సమంత అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా తాజాగా సామ్ ఈ సిరీస్ గురించి సోషల్ మీడియా వేదికన అప్డేట్ ఇచ్చింది. ‘రక్త్‌బహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సెట్ లోకి అడుగుపెట్టామని తెలిపింది. మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశానని వెల్లడించింది.. ఓ ఫొటో పంచుకుంది. ప్రజెంట్ సమంత ఇచ్చిన అప్డేట్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






