- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమంత - రాజ్ ల పెళ్లి.. అలా చేస్తున్నపుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయ్: శిల్పారెడ్డి
సమంత - రాజ్ నిడిమోరుల రెండో పెళ్లి జరిగి మూడ్రోజులవుతున్నా.. ఇంకా దీనిపైనే అంతా చర్చించుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సమంత - రాజ్ నిడిమోరుల రెండో పెళ్లి జరిగి మూడ్రోజులవుతున్నా.. ఇంకా దీనిపైనే అంతా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో రాజ్ - సమంతల వైవాహిక జీవితం బాగుండాలని కొందరు కోరుకుంటుండగా.. మరికొందరు మాత్రం ఈ పెళ్లి మాత్రం ఎంతకాలం నిలుస్తుందిలే అని నిట్టూరుస్తున్నారు. కాగా.. వీరిద్దరి వివాహం ఈశా ఫౌండేషన్లో ఉన్న లింగభైరవి ఆలయంలో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి ఫొటోల్లో సమంత పక్కనే ఆమెను హత్తుకుని, ముద్దు చేసిన స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర శిల్పారెడ్డి పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలను తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సమంత - రాజ్ విజాతి ధృవాల్లాంటి వారని, సమంత యాక్టివ్ గా ఉంటే.. రాజ్ ది చాలా సైలెంట్ గా ఉండే మనస్తత్వమని పేర్కొన్నారు. ఇలాంటి పెళ్లిని తాను ఇంతవరకూ జీవితంలో చూడలేదన్నారు. ఇరుకుటుంబాల నుంచి .. వారి గురించిన పూర్తిగా తెలిసిన 10 మంది కుటుంబ సభ్యులు వచ్చారని, సినీ ఇండస్ట్రీ నుంచి నందినిరెడ్డి వచ్చారని చెప్పారు. ఎంతో నిరాడంబరంగా జరిగిన పెళ్లిలో.. అగ్నిదేవుడి ముందు వధువు వేలికి, వరుడి వేలికి సూత్రాన్ని ధరించే విధానాన్ని చూసి తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని, వారిమధ్య ఏదో శక్తి వచ్చినట్లుగా అనిపించిందన్నారు శిల్పారెడ్డి. ఇక ఫేమస్ సింగర్ శోభరాజు రాజ్ కు బంధువు అన్న విషయం తనకు రీసంట్ గా తెలిసిందన్నారు.
సమంత ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిందని, ఆమెతో తనకున్న అనుబంధం గురించి మాటల్లో చెప్పలేనిదన్నారు. ఇద్దరం ఒకరిపై ఒకరం సెటైర్స్ వేసుకుంటాం అని, సరదాగా ఏడిపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.






