- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు అతనితో రిలేషన్ షిప్‌ను కన్ఫర్మ్ చేసిన సమంత.. అలా కనిపించడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
స్టార్ హీరోయిన్ కమ్ నిర్మాత సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కమ్ నిర్మాత సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(/ye maya Chesave) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఇందులో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంది. కానీ పట్టుమని నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత నాగ చైతన్య గత ఏడాది హీరోయిన్ శోభిత(Shobitha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సమంత మాత్రం మరో మ్యారేజ్ చేసుకోలేదు.
కానీ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో మాత్రం డేటింగ్‌లో ఉందనే వార్తలు నిత్యం సోషల్ మీడియా(Social Media)లో కూడా కూస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరికి సంబంధించిన ఫొటోస్ సామ్ తన ఇన్‌స్టా(Instagram)లో పోస్ట్ చేయడంతో ఆ వార్తలకు ఆజ్యం పోయినట్లయింది. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరు వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు. తాజాగా సామ్ పోస్ట్ చేసిన ఫొటోస్‌లో రాజ్ నిడిమోరు సమంత భుజంపై చేసి వేసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు వీరిద్దరిని అంత క్లోజ్‌గా చూడడంతో కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link






