Samantha: డైరెక్టర్‌తో సమంత డేటింగ్.. అతని చేయి పట్టుకుని కనిపించి షాకిచ్చిందిగా అంటున్న నెటిజన్లు? (ఫొటోలు)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) చివరగా ‘ఖుషి’ (Kushi) మూవీలో నటించింది.

Samantha: డైరెక్టర్‌తో సమంత డేటింగ్.. అతని చేయి పట్టుకుని కనిపించి షాకిచ్చిందిగా అంటున్న నెటిజన్లు? (ఫొటోలు)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) చివరగా ‘ఖుషి’ (Kushi) మూవీలో నటించింది. 2023లో ఆమెకు మయోసైటీస్ వ్యాధి రావడంతో అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. పూర్తిగా తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టిన ఆమె పలు రకాల చికిత్సలను పొందుతోంది. అయితే గత ఏడాది సమంత ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత సమంత ఎలాంటి కొత్త సినిమాను ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అలాగే తన హాట్ ఫొటోస్‌తో హీట్ పుట్టిస్తోంది.

ఇక సమంత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె గతంలో నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇక డైవర్స్ తర్వాత చైతు శోభిత(Sobitha Dhulipala)తో ప్రేమలో పడ్డారు. గత ఏడాది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక సమంత విషయానికొస్తే.. ఆమె డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, సమంత, రాజ్‌తో కలిసి పికిల్ బాల్ టోర్నమెంట్‌తో కనిపించడంతో డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ఇద్దరు జంటగా వెళ్లి సందడి చేయడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక చెన్నైచాంపియన్స్‌కు సపోర్ట్ చేస్తున్న సామ్ వారితో ఫొటో దిగుతూ రాజ్ చేతి పట్టుకుని కనిపించింది. దీంతో వీరిద్దరి డేటింగ్ వార్తలు నిజమేనని నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సామ్, రాజ్ పికిల్ బాల్ టోర్నీలో సన్నిహింగా ఉండండం సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ వీరిద్దరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు డేటింగ్‌లో మునిగి తెలుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం చేయి పట్టుకుని షాకిచ్చిందని అంటున్నారు. కానీ సమంత అభిమానులు మాత్రం వారిద్దరు ఫ్రేండ్స్ ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయవద్దని ఫైర్ అవుతున్నారు.

Next Story