Pawan Kalyan: పవర్ స్టార్‌కు క్యూట్‌గా ప్రపోజ్ చేసిన సమంత.. వీడియో వైరల్

by Hamsa |
Pawan Kalyan: పవర్ స్టార్‌కు క్యూట్‌గా ప్రపోజ్ చేసిన సమంత.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రామ్ చరణ్, ఎన్టీఆర్(NTR), వంటి స్టార్స్‌తో నటించి ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా రాణించిన సమంత(Samantha) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మయోసైటీస్(Myositis) వచ్చిన కానుంచి ఆమె ఏ సినిమా చేయలేదు. కానీ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే సామ్ ఇటీవల ‘సిటాడెల్: హనీ, బన్నీ’(Citadel: Honey, Bunny) వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రాజ్ అండ్ డీకే(Raj and DK) దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా(Varun Dhawan) నటించాడు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ సిరీస్ ఇటీవల ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్‌కు నామినేట్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో హీరో నితిన్‌తో ఉన్న ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు క్యూట్‌గా ప్రపోజ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు వావ్ సో క్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story