లైవ్‌లో భర్త రాజ్‌కు ఫోన్ చేసిన సమంత: ఉగాది పచ్చడి తనే చేశానంటూ సర్‌ప్రైజ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-19 10:43:54  IST  )

ఉగాది పర్వదినం సందర్భంగా యాంకర్ సుమ షోలో సినీనటి సమంత సందడి చేసింది. ఉగాది పచ్చడి తనే చేశానంటూ భర్తకు వీడియో కాల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది.

లైవ్‌లో భర్త రాజ్‌కు ఫోన్ చేసిన సమంత: ఉగాది పచ్చడి తనే చేశానంటూ సర్‌ప్రైజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేసిన ఉగాది స్పెషల్ షోలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి సమంత, సరదాగా తన భర్త రాజ్‌కు లైవ్ కాల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పండుగ సందడిలో భాగంగా జరిగిన ఈ ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది.

భర్త రాజ్‌కు సమంత వీడియో కాల్..

అయితే, షో మధ్యలో సమంత తన భర్త రాజ్‌కు ఫోన్ చేశారు. ఉగాది పర్వదినం కావడంతో ఇంటి దగ్గర విశేషాలను పంచుకుంటూ, తాను చేసిన ఉగాది పచ్చడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఈ ఏడాది ఉగాది పచ్చడి నేనే చేశాను.. ఎలా ఉందో చెప్పు?’ అంటూ ఆమె సరదాగా అడగడం అందరినీ నవ్వించింది. దానికి రాజ్ స్పందిస్తూ ఆమెను మెచ్చుకోవడంతో షోలో సందడి నెలకొంది.

సుమ, నందిని రెడ్డిలకు శుభాకాంక్షలు..

కేవలం సమంతతోనే కాకుండా, అక్కడే ఉన్న స్టార్ యాంకర్ సుమ, ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డిలతో కూడా రాజ్ మాట్లాడారు. వారికి ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నందిని రెడ్డి, సమంతల మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే, ఈ క్రమంలో రాజ్‌తో వారి సంభాషణ చాలా సరదాగా సాగింది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో, సమంత వీడియో కాల్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Next Story