Samantha: గుడ్ న్యూస్ ప్రకటించిన సమంత.. ఈ జర్నీ చాలా స్పెషల్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) చివరగా ‘ఖుషి’ (Kushi) సినిమాలో కనిపించింది. ఈ మూవీ థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Samantha: గుడ్ న్యూస్ ప్రకటించిన సమంత.. ఈ జర్నీ చాలా స్పెషల్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) చివరగా ‘ఖుషి’ (Kushi) సినిమాలో కనిపించింది. ఈ మూవీ థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత పూర్తిగా సమంత ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మయోసైటీస్ వ్యాధి రావడంతో చికిత్స తీసుకుంది. పూర్తిగా ఇంట్లోనే ఉండి తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా పలు ప్రదేశాల్లోనూ సామ్ ట్రీట్మెంట్ తీసుకుంది. ఇక ఏడాది తర్వాత ఆమె మళ్లీ గత ఏడాది ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny)వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయి ఊహించని విధంగా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే పలు అవార్డ్స్‌ను కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సమంత ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా ఇండస్ట్రీకి వస్తారా అని వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆమె ఓ మూవీ ప్రకటించింది కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా, సమంత గుడ్ న్యూస్ ప్రకటించింది. నిర్మాతగా మారబోతున్నట్లు తెలపడంతో పాటు తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై మొదటి ప్రాజెక్ట్‌గా ‘శుభం’ (shubam) షూటింగ్ పూర్తైనట్లు వెల్లడించింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆసక్తికర పోస్ట్ పెట్టింది. మా చిన్న ప్రేమను మీకు అందిస్తున్నాను.

పెద్ద కలలతో చిన్న జట్టు! ఈ ప్రయాణానికి మరియు మేము కలిసి సృష్టించినందుకు మేము చాలా కృతజ్ఞులం. మీరు మా చిత్రాన్ని ఆస్వాదిస్తారని మేము నిజంగా ఆశిస్తున్నాము. నిజంగా ఈ జర్నీ చాలా స్పెషల్. శుభం భవతు’’ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే ఈ సినిమాకు ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘శుభం’లో శ్రియ కొంరెం, చరణ్ పెరి(Charan Peri), షాలిని కొండెపూడి, గవిరెడ్డి శ్రీనివాస్(Gavi Reddy Srinivas), శ్రావణి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Next Story