SAMANTHA: నాగచైతన్యతో విడాకుల తర్వాత.. చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్న సమంత..

by Kavitha |   ( Updated:2024-08-22 08:04:35.0  )
SAMANTHA: నాగచైతన్యతో విడాకుల తర్వాత.. చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్న సమంత..
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది.

ఇదిలా ఉంటే.. నాగచైతన్యతో విడాకులు అయ్యాక మొదటిసారి సమంత మీడియా ముందుకు వచ్చింది. దీంతో చాలామంది మీడియా వాళ్ళు సమంతని నాగచైతన్య రెండో పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు అడగాలని ప్రిపేరై వచ్చారు. అయితే వాళ్ళు ఈ ప్రశ్నలు ఏవి అడగడానికి సమంత కాస్త కూడా వీలు ఇవ్వలేదు. ఎందుకంటే ఆమె స్పోర్ట్స్ టీమ్‌ను కొనుగోలు చేసింది కాబట్టి ఆ ప్రెస్ మీట్‌లో కేవలం స్పోర్ట్స్ గురించే మాట్లాడి ఇంటర్వ్యూకి గుడ్ బై చెప్పేసింది.

అయితే సమంతను అడిగే ప్రశ్నలన్నింటినీ మొదటే ప్రిపేర్ అయి వచ్చిన కొంతమంది మీడియా వాళ్లకి నిరాశే ఎదురైంది. ఇక ఈ సమావేశంలో సమంత లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అందరూ ఆమె ప్రేమించిన వ్యక్తి గురించి చెబుతుంది అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సమంత పికిల్ బాల్‌ని చూడడంతోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే ఫీలింగ్ కలిగిందని చెప్పడంతో మరోసారి అందరూ నిరాశపడ్డారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed