- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Salman khan: హత్య బెదిరింపులపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) 'సికిందర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) 'సికిందర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో కనిపించనుంది. ఇక కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సల్లూ భాయ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే, ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (gangster Lawrence Bishnoi) నుంచి తనకు వచ్చిన హత్య బెదిరింపులపై కూడా స్పందించారు.
ఇటీవలే కాలంలో సల్మాన్‌కు పలుమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. తాను దేవుడిని నమ్ముతానని, అన్నీ ఆ అల్లానే చూసుకుంటాడంటూ వ్యాఖ్యానించారు. అలాగే, ఆయుష్షు ఉన్నంత కాలం జీవిస్తానని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఇక బెదిరింపుల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారని, కొన్నిసార్లు ఈ భద్రత కూడా సవాలుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సల్మాన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా, 1998లో కృష్ణ జింకను చంపాడని సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ఈ గ్యాంగ్ నుంచి సల్మాన్ అనేక సార్లు హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు. అంతేకాదు, గతేడాది ఏప్రిల్‌లో గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే జూన్‌లో మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగింది. వరుస హత్య బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్‌కు వైప్లస్ భద్రతను సమకూర్చారు. అలాగే, సల్మాన్‌ఖాన్ ముంబైలో నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు.






