Salman Khan : రాజకీయాల్లోకి రావడంపై సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-24 12:46:57  IST  )

నాకు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని చాలాసార్లు అనిపిస్తుంది.కానీ, ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారీ నేను ప్రస్తుతం నివసిస్తున్న మా గెలాక్సీ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ వైపు చూస్తాను.

Salman Khan : రాజకీయాల్లోకి రావడంపై సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలుగు, హిందీ అని భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. హిందీలో ‘మాతృభూమి’ సినిమా చేస్తుండగా.. తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రీసెంట్‌గా ఫేమస్ కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’లో గెస్ట్‌గా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ.. సల్మాన్‌ను రాజకీయాల గురించి ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. దానికి సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో ఇచ్చిన పంచ్ ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. షోలో భాగంగా కపిల్ శర్మ అడుగుతూ.. "సార్, మన దేశంలో చాలా రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద స్టార్లను తమ పార్టీల్లోకి ఆహ్వానించి, వారి క్రేజ్‌ను వాడుకుంటూ ఎన్నికల బరిలో నిలబెడుతుంటాయి.

ప్రస్తుతం దేశంలో మీకంటే ఎక్కువ ఫ్యాన్ బేస్, పాపులారిటీ ఉన్న స్టార్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. మరి అలాంటిది మీకు ఎప్పుడూ ఎన్నికల్లో నిలబడి రాజకీయాల్లోకి రావాలనిపించలేదా?" అని ప్రశ్నించారు. కపిల్ అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఖాన్ నవ్వుతూ చాలా ఫన్నీగా స్పందించారు. "నాకు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ, ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారీ నేను ప్రస్తుతం నివసిస్తున్న మా గెలాక్సీ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ వైపు చూస్తాను. మా బిల్డింగ్‌లో మొత్తం ఎనిమిది ఫ్లాట్లు ఉంటే.. అందులో మూడు ఫ్లాట్లు మా కుటుంబానివే మావే ఉంటాయి. దేశ ప్రధాని, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఒకవేళ నేను మా బిల్డింగ్ ప్రెసిడెంట్ లేదా సెక్రటరీ పదవికి పోటీ చేసినా సరే ఘోరంగా ఓడిపోతాను. ఎందుకంటే నా సొంత ఇంట్లో వాళ్లే నాకు ఆ మూడు ఓట్లు కూడా వేయరు" అంటూ గట్టిగా నవ్వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story