- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పుష్ప 3’కి గాడ్ ఫాదర్ బాలీవుడ్ సూపర్ స్టార్?
‘పుష్ప’ సిరీస్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేయబోతుందని తెలుస్తోంది.

దిశ, సినిమా : ‘పుష్ప’ సిరీస్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేయబోతుందని తెలుస్తోంది. అయితే దీనికి ముందు అల్లు అర్జున్ ‘పుష్ప 3’లో ఆయన క్యారెక్టర్‌ను యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బిలియనీర్ మాస్టర్‌మైండ్, బిజినెస్ గాడ్ ఫాదర్ ‘సుల్తాన్’గా ఆయన కనిపించబోతున్నాడని టాక్. ఇది కేవలం గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే కాదు ఈ సుల్తాన్ క్యారెక్టర్‌ను ఉపయోగించి కొత్త సినిమా తెరకెక్కించే ప్లాన్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీన్ని ఈ డికేడ్ క్రాస్ఓవర్‌గా చెప్తున్నారు. ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోయినా.. స్పెషల్‌గా సల్లూ భాయ్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ఉంటుందనేది కన్ఫర్మ్. కాగా ఈ చిత్రం అటు బాలీవుడ్ ఇటు సౌత్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తుండగా.. బ్లాక్ బస్టర్ బొమ్మ కన్ఫర్మ్ అంటున్నారు.






