- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RSS వేడుకలకు సల్మాన్ ఖాన్ హాజరు !
తన కారులో మైదానానికి వచ్చిన సల్మాన్ ఖాన్, మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ సందడి చేశారు.

దిశ, వెబ్ డెస్: RSS చరిత్రలో సరికొత్త సంఘటన తెరపైకి వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ( Salman Khan) హాజరయ్యారు. మోహన్ భగవత్ ( Mohan Bhagwat) పిలుపు మేరకు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ( RSS centenary event) గాను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చారు. ముంబైలోని బాంద్రా -కుర్లా కాంప్లెక్స్ మైదానంలో ఈ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తన కారులో మైదానానికి వచ్చిన సల్మాన్ ఖాన్, మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ సందడి చేశారు. సల్మాన్ ఖాన్ ముస్లిం మతానికి చెందిన వాడు అయినప్పటికీ, హిందూ మతానికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీయబోతోంది. ఇక ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో పాటు ఏక్ నాథ్ షిండే, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు.






