Prabhas: సలార్ అరుదైన రికార్డు.. ఏకంగా 500 రోజులుగా !

by velandi.Saikiran |   (  Updated:2025-07-06 02:36:46  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్

Prabhas: సలార్ అరుదైన రికార్డు.. ఏకంగా 500 రోజులుగా !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు ప్రభాస్. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్... తన టాలెంట్ నిరూపించుకొని నిలబడ్డాడు. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. అయితే ప్రభాస్ 2023 సంవత్సరంలో రిలీజ్ చేసిన సినిమా సలార్.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ప్రభాస్ హీరోగా చేయగా... శృతిహాసన్ అలాగే శ్రీయ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు. పృథ్వీరాజ్ స్పెషల్ రోల్ లో.. అదరగొట్టారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 22, 2023 సంవత్సరంలో రిలీజ్ అయి బంపర్ విజయ్ అని నమోదు చేసుకుంది.

అంతేకాదు 270 కోట్లు పెట్టి తీస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. సలార్ పార్ట్ 2 కూడా త్వరలోనే రాబోతుంది. అయితే సలార్ మొదటి పార్ట్ ఓటీటీ లో రిలీజ్ అయి దాదాపు 500 రోజులు పూర్తయింది. జియో హాట్ స్టార్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి 500 రోజులు అయినప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఈ మేరకు ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మా హీరో సినిమా 500 రోజులైనప్పటికీ.. అదరగొడుతోందని పోస్ట్లు పెట్టి వైరల్ చేస్తున్నారు.

Next Story