రాశీ ఖన్నా కాదు నేనే ఆ సినిమా హీరోయిన్.. కుర్ర హీరోయిన్ సంచలనం

by Sujitha Rachapalli |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

రాశీ ఖన్నా కాదు నేనే ఆ సినిమా హీరోయిన్.. కుర్ర హీరోయిన్ సంచలనం
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ చార్ట్ బస్టర్ కాగా త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్‌గా తనే చేసినట్లు హీరోయిన్ సాక్షి వైద్య వివరించింది. రాశీ ఖన్నా చేస్తున్న పాత్రకు వారం రోజులపాటు షూటింగ్‌లో కూడా పాల్గొన్నానని.. కానీ డేట్స్ ఇష్యూ కారణంగా తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పింది. కానీ పవర్ స్టార్‌తో మరోసారి నటించే చాన్స్ వస్తు వదులుకోనని తెలిపింది. కాగా ఈ బ్యూటీ తాజాగా ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో హిట్ అందుకుంది.

Next Story