సినిమాల కోసం బోల్డ్ ఫొటో షూట్.. మితిమీరుతున్న యంగ్ బ్యూటీ అందాలు!

by Chukka Sudharani |   (  Updated:2025-04-30 14:55:49  IST  )

ముంబై బ్యూటీ సాక్షి మాలిక్ సినిమా ఆఫర్ల కోసం రోజు రోజుకు తన అందాలను మరింత పెంచే పనిలో పడింది.

సినిమాల కోసం బోల్డ్ ఫొటో షూట్.. మితిమీరుతున్న యంగ్ బ్యూటీ అందాలు!
X

దిశ, సినిమా: ముంబై బ్యూటీ సాక్షి మాలిక్ (Sakshi Malik) సినిమా ఆఫర్ల కోసం రోజు రోజుకు తన అందాలను మరింత పెంచే పనిలో పడింది.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. అంతే కాకుండా.. తన బోల్డ్ ఫొటో షూట్‌లతో యువతను ఆకర్షిస్తున్న ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో ల‌క్షల్లో ఫాలోవ‌ర్స్‌ని సంపాదించుకుంది. ఇక సినిమాల పరంగా కాకుండా.. సోషల్ మీడియాలోనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్న సాక్షి నిరంతరం వేడిక్కించే ఫొటోషూట్లతో, మత్తెక్కించే అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూ లక్షల్లో లైకులు సొంతం చేసుకుంటున్నాయి. కాగా.. సాక్షి మాలిక్.. కార్తీక్ ఆర్యన్ నటించిన ‘సోను కే టిటు కి స్వీటీ’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ‘బోమ్ డిగ్గీ డిగ్గీ’ అనే పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసి కుర్రాళ్లను ఆకట్టుకుంది. తర్వాత 2023లో ‘డ్రై డే’ అనే సినిమాలో కనిపించింది. ఇక అప్పటి నుంచే సైలెంట్‌గా ఉంటున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాను మాత్రం తన అందాలతో షేక్ చేస్తుంది.

Next Story