Sakshi Agarwal: సినిమాలు తక్కువ.. అక్కడ ఎక్కువ.. మరోసారి అందాలతో ఎటాక్

by Pulgam srinivas |

సాక్షి అగర్వాల్... తక్కువ సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Sakshi Agarwal: సినిమాలు తక్కువ.. అక్కడ ఎక్కువ.. మరోసారి అందాలతో ఎటాక్
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి సాక్షి అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. ఈమె ఎక్కువ శాతం తమిళ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది. 2013లో వచ్చిన రాజా రాణి చిత్రంతో ఈ ముద్దుగుమ్మ వెండితెరకు పరిచయం అయింది. అంతకుముందు పలు టీవీ షోలలో పార్టిసిపేట్ చేసి బుల్లితెర అభిమానులను బాగానే సంపాదించుకుంది.




ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా చాలా తక్కువ సినిమాల్లోనే నటించింది. ఈ బ్యూటీ సినిమాల సంఖ్య తక్కువగా ఉన్నా అభిమానులను మాత్రం బాగానే సంపాదించుకుంది. సాక్షి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ రోజురోజుకు తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటూ వస్తుంది.




ఈ బ్యూటీ ఇప్పటికీ అనేకసార్లు తన సోషల్ మీడియా అకౌంట్లో హాట్ ఫోటోలను పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. దానితో ఈమెకు ఓ స్టార్ హీరోయిన్ రేంజ్లో ఫాలోవర్స్ ఏర్పడ్డారు. తాజాగా ఈ బ్యూటిఫుల్ నటి తన 'ఇన్ స్టా'లో కొన్ని హాట్ లుక్లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.




సాక్షి అగర్వాల్ తాజాగా ఉల్లిపొరలాంటి లైట్ బ్లూ కలర్ శారీని కట్టుకొని, గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ను ధరించి తన బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ ఎక్సలెంట్ గా ఉండడంతో ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు అనేకమంది బ్యూటిఫుల్, ఆసమ్, లవ్, ఫైర్ ఎమోజీలను కామెంట్లుగా పెడుతున్నారు.

Next Story