- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువ జంట పాడుకునే అందమైన ప్రేమపాటగా ‘సఖియే’..
‘యూత్’ సినిమా నుంచి ‘సఖియే’ సాంగ్ రిలీజ్

దిశ, సినిమా: తమిళ మూవీ ‘యూత్’ చిత్రాన్ని.. ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న ‘యూత్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా'సఖియే..' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌ను జీవీ ప్రకాష్ కుమార్ బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేశారు. 'సఖియే..' సాంగ్ ఎలా ఉందో చూస్తే.. ‘పలికానే పెదాలతోనే పలుమార్లు ఇలా నీ పేరే, అలవాటే లేదాయే వెతికే మాయవి నీవేలే, ఒక మాటే మాటాడమంటే మదిదాటి రాలేను అందే.. సఖియే, సఖియే..' అంటూ యువ జంట పాడుకునే అందమైన ప్రేమపాటగా సాగుతూ ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ రాగా.. సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.






