చాయ్ వాలాకు సజ్జనార్ ఎంకరేజ్మెంట్

by Sujitha Rachapalli |

శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

చాయ్ వాలాకు సజ్జనార్ ఎంకరేజ్మెంట్
X

దిశ, సినిమా : శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ప్రమోద్ హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో టైటిల్ సాంగ్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కమిషనర్ సజ్జనార్, నీలోఫర్ ఫౌండర్ బాబురావు, కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సజ్జనార్.. ‘ఈ ‘చాయ్ వాలా’ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. శివ కందుకూరి లాంటి యంగ్ హీరో, రాజీవ్ కనకాల లాంటి సీనియర్ యాక్టర్స్ ఇందులో నటించారు. నీలోఫర్ బాబుగారు అందరికీ స్పూర్తి. ఆయన ఈ మూవీని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది’ అని అన్నారు.

Next Story