Saif Ali Khan:ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-21 09:49:54  IST  )

బాలీవుడ్ (Bollywood) నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఆరోగ్యం మెరుగుపడిందని.. ఈ క్రమంలో డిశ్చార్జ్ కానున్నారని లీలావతి ఆస్పత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే వెల్లడించిన విషయం తెలిసిందే.

Saif Ali Khan:ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్
X

దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్ (Bollywood) నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఆరోగ్యం మెరుగుపడిందని.. ఈ క్రమంలో డిశ్చార్జ్ కానున్నారని లీలావతి ఆస్పత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటుడు సైఫ్ అలీఖాన్ తాజాగా(జనవరి 21) డిశ్చార్జ్ అయ్యారు. తన ఇంట్లోకి చొరబడి దుండగుడు దాడి చేయగా నటుడికి గాయాలైన సంగతి తెలిసిందే ఆరు రోజుల చికిత్స అనంతరం లీలావతి ఆస్పత్రి నుంచి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. దాడిలో భాగంగా సైఫ్ వెన్నెముకకు తీవ్ర గాయం అయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. ఈ ఘటన బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు.. సిబ్బంది సైఫ్ నివాసం వద్ద సీసీ కెమెరాలు అమర్చుతున్నారు.

Next Story