మంచి ఆఫర్.. కానీ హీరో, నిర్మాత, దర్శకునితో పడుకోవాలి.. కావాలంటే నీ తల్లిని పంపు.. ప్రముఖ నటికి కాల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-24 10:41:10  IST  )

ప్రముఖ నటి సాయి తమ్‌ హంకర్ ఓ ఇంటర్వ్యూలో తన కాస్టింగ్ కౌచింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకుంది. ఓ హీరో, నిర్మాత, డైరెక్టర్‌తో తనను కమిట్ కావాలని అడిగారని చెప్పిన ఆమె.. ఇందుకు సంబంధించిన అనుభవాన్ని వివరంగా చెప్పింది. చాలా కాలం క్రితం తనకు ఓ ఫోన్ కాల్

మంచి ఆఫర్.. కానీ హీరో, నిర్మాత, దర్శకునితో పడుకోవాలి.. కావాలంటే నీ తల్లిని పంపు.. ప్రముఖ నటికి కాల్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటి సాయి తమ్‌ హంకర్ ఓ ఇంటర్వ్యూలో తన కాస్టింగ్ కౌచింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకుంది. ఓ హీరో, నిర్మాత, డైరెక్టర్‌తో తనను కమిట్ కావాలని అడిగారని చెప్పిన ఆమె.. ఇందుకు సంబంధించిన అనుభవాన్ని వివరంగా చెప్పింది. చాలా కాలం క్రితం తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్న ఆమె.. ‘నా దగ్గర మంచి ఆఫర్ ఉంది కానీ పాత్ర కోసం నువ్వు ఓ పని చేయాలి.. డైరెక్టర్, నిర్మాతతో పడుకోవాలి. నార్మల్‌గా హీరోతో ఇలాంటివి ఉంటాయి కానీ ఇక్కడ నువ్వు కాబట్టి ఇలా చేయాల్సిందే’ అన్నాడని తెలిపింది. వెంటనే కోపం వచ్చి.. ‘కావాలంటే నీ తల్లిని పంపు’ అని చెప్పానని.. దీంతో ఆ వ్యక్తి పది సెకన్లు సైలెంట్ అయిపోయాడని తెలిపింది. దీంతో ‘ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది.. నాకు ఇలాంటి ఆఫర్స్ అవసరం లేదని అన్నా’ అని తెలిపింది నటి. ఆ తర్వాత తనకు అలాంటి కాల్స్ రాలేదన్న సాయి.. మనకు తప్పుగా అనిపించినప్పుడు.. వెంటనే తప్పు అని చెప్పాలి.. లేదంటే బలైపోతామని సూచించింది.

Next Story