- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడే భార్య ముందు ఓడిపోయిన సాయి శ్రీనివాస్ బెల్లంకొండ.. నెట్టింట క్యూట్ వీడియో వైరల్
పెళ్లి అయ్యాక మొదటిసారి సాయి శ్రీనివాస్ బెల్లంకొండ, కావ్యల క్యూట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సాయి శ్రీనివాస్ బెల్లంకొండ తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కావ్యా రెడ్డి అనే అమ్మాయిని ఆధ్యాత్మిక వాతావరణంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వివాహం చేసుకున్నాడు. ఏప్రిల్ 29 నైట్ 11:05 గంటలకు వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో వీరిద్దరు ఒకటయ్యారు. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సైతం హాజరయ్యారు. ఇక పెళ్లి వేడుక అనంతరం ఈ కొత్త పెళ్లి జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు, సినీ లవర్స్ సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. సంప్రాదాయాల ప్రకారం పెళ్లి చేసుకుని మొదటిసారి కొత్త కోడలు అత్తింట్లో అడుగు పెట్టినప్పుడు గుమ్మం దగ్గర ఆపి ఆటపట్టించడం ఆనవాయితి. ఇప్పుడు ఇదే ఆనవాయితీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. గుమ్మం దగ్గర సాయి శ్రీనివాస్ బెల్లంకొండ తన భార్య కావ్యా రెడ్డితో ఉండగా.. వారిని పేర్లు చెప్పమంటారు. ఇక కావ్య మాత్రం ఏ మాత్రం తడబడకుండా ‘నేను కావ్యా బెల్లంకొండ... మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో కలిసి మా అత్త ఇంటికి కొత్తకోడలు గా వచ్చాను’ అని తెలిపింది. అయితే సాయి మాత్రం కాస్త సిగ్గుపడుతూ తడబడతాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో కోసం క్లిక్ చేయండి






