- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయి పల్లవి ‘ఏక్ దిన్’ మూవీ టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi), అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ జంటగా నటిస్తున్న భారీ రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దిన్’.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi), అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ జంటగా నటిస్తున్న భారీ రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దిన్’. సునీల్ పాండే(Sunil Pandey) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్ ఖాన్(Aamir Khan), మన్సూర్ ఖాన్(Mansur Khan) మరియు అపర్ణ పురోహిత్(Aparna Purohith) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
రామ్ సంపత్(Ram Sampath) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇర్షాద్ కామిల్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి టీజర్(Teaser)ను రిలీజ్ చేశారు. ఏక్ దిన్ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో సాంగ్ వస్తూ టీజర్ చాలా బాగా అనిపించింది. అలాగే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చూడటానికి బాగుంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






