- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sai Pallavi: దానికోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా.. నేచురల్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రేమమ్’(Premam) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆ అమ్మడు.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత ‘ఫిదా’(Fidaa) సినిమాలో నటించి మెప్పించింది. అంతే కాకుండా తన యాక్టింగ్‌తో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అంతే కాకుండా బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయకపోవడం, మేకప్ వేసుకోకపోవడం వల్ల మరింత ఫేమ్ అయింది.
ఇక ఈ భామ డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే సాయి పల్లవి రీసెంట్‌గా ‘అమరన్’(amaran) మూవీతో మంచి విజయం సాధించింది. ఇక తాజాగా నాగ చైతన్య(Naga chaitanya), చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’(Thandel) సినిమాలో కూడా నటించి అలరించింది. తన యాక్టింగ్‌తో ఆడియన్స్ నుంచి ఫుల్ మార్కులే కొట్టేసింది. లవర్స్ డే కానుకగా అల్లు అరవింద్ (Allu aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
అంతేకాకుండా నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్లు రాబడుతున్న సినిమాగా తండేల్ నిలుస్తోంది. ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘నాకు జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది. ఎందుకంటే నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా మామ్మ ఓ చీర ఇచ్చింది. పెళ్లి చేసుకున్నప్పుడు దానిని కట్టుకోమని చెప్పింది. అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు. కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు దాన్ని కట్టుకుందామనుకున్నా.
ఆ తర్వాత మూడేళ్లకు సినిమాల్లోకి అడుగు పెట్టాను. నా ఫస్ట్ మూవీ ‘ప్రేమమ్’ కోసం వర్క్ చేశా. ఇండస్ట్రీలోకి వచ్చిన స్టార్టింగ్‌లో ఏదో ఒకరోజు తప్పకుండా ఒక ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటానని నమ్మాను. జాతీయ అవార్డు అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్ప. కాబట్టి, దానిని అందుకున్న రోజు ఈ చీర కట్టుకుని అవార్డుల ప్రధానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా. దానిని అందుకున్నా, అందుకోకపోయినా.. ఈ శారీ ధరించే వరకు నాపై ఒత్తిడి ఉంటునే ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






