ఆ లెజెండరీ బయోపిక్‌లో సాయి పల్లవి

by Pulgam srinivas |

బాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా బన్సాలీ లెజెండరీ నటి మధుబాల జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందించనున్నట్లు అందులో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఆ లెజెండరీ బయోపిక్‌లో సాయి పల్లవి
X

దిశ, వెబ్ డెస్క్: సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు. ఇప్పటివరకు ఆమె ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎప్పుడూ గ్లామర్ షో వైపు వెళ్లలేదు. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చి పోటీ పెరిగినా కూడా ఆమె తనదైన మార్గంలోనే ముందుకు సాగుతోంది. అందుకే ఆమె వ్యక్తిత్వానికి కూడా ఎంతోమంది అభిమానులు ఫిదా అవుతున్నారు. సాయి పల్లవి ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం వంటి పలు భాషల్లో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ నటి నటిస్తున్న ఏక్ దిన్ అనే బాలీవుడ్ చిత్రం ఈ ఏడాది మే 1న విడుదల కానుంది. అలాగే రామాయణ అనే భారీ హిందీ చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. ఇందులో ఈ నటి సీత పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రెండు పెద్ద హిందీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న ఆమెకు మరో ప్రముఖ దర్శకుడి సినిమాలో అవకాశం దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా బాన్సాలీ లెజెండరీ నటి మధుబాల జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందించనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

మొదట ఈ చిత్రంలో కియారా అద్వానీ , అనీత్ పడ్డ వంటి నటీమణులు ప్రధాన పాత్రల్లో కనిపించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు సాయి పల్లవిను తీసుకోవాలని దర్శకుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఆమె ఈ సినిమాలో నటించే అవకాశముంది. ఇప్పటికే పద్మావత్ , గంగుబాయ్ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు కావడంతో, ఈ బయోపిక్‌ను కూడా అదే స్థాయిలో గొప్పగా వెండితెరపై ఆవిష్కరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

Next Story