- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sai Pallavi: ఒక్కరోజు సెలవు కోసం వెక్కి వెక్కి ఏడ్చాను.. అయినా ప్రయోజనం లేదు
ఒకేసారి మూడు సినిమాలు చేయడంతో అసలు ఖాళీ సమయం దొరకక, బాధతో వెక్కివెక్కి ఏడ్చినట్లు సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ నటీమణుల్లో ఒకరైన సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె మలయాళ చిత్రాల ద్వారా కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత ఎన్నో భాషల సినిమాల్లో నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించింది. ప్రస్తుతం అత్యంత భారీ అంచనాల నడుమ రూపొందుతున్న రామాయణ చిత్రంలో ఈమె సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.
అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం దీపావళికి, రెండవ భాగాన్ని వచ్చే సంవత్సరం దీపావళికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే సాయి పల్లవి క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఒక సందర్భంలో తాను ఓ విషయంలో వెక్కి వెక్కి ఏడ్చినట్లు వెల్లడించింది. సాయి పల్లవి మాట్లాడుతూ… నేను కెరీర్ ప్రారంభంలో ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా చేసేదాన్ని. దాంతో నాకు పెద్దగా ప్రెజర్ ఉండేది కాదు.
కానీ కోవిడ్ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా ఒకేసారి మూడు సినిమాలు చేయాల్సి వచ్చింది. దాంతో మూడు సినిమాలకు సమానంగా టైమ్ కేటాయించాల్సి రావడంతో ఒక్కరోజు కూడా గ్యాప్ దొరికేది కాదు. అలాంటి సమయంలో పని చేసి చేసి చాలా అలసిపోయి, ఒక్కరోజు అయినా హాలిడే వస్తే బాగుండేదని బాధపడుతూ వెక్కి వెక్కి ఏడ్చాను. కానీ ఆ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పలేదు. అందుకు కారణం నావల్ల సినిమా ఎలాంటి ఇబ్బందుల్లో పడకూడదని భావించి సినిమాలను పూర్తి చేశాను. అలా ఒక్కరోజు హాలిడే కోసం బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.






