నిజంగా తీసినవే.. ఏఐ ఫొటోలు కాదు.. బికిని ఫొటోలపై సాయి పల్లవి క్లారిటీ

by Chukka Sudharani |

పద్ధతైన పాత్రలు, అద్భుతమైన డ్యాన్సులు, క్లాసీ లుక్ వీటి గురించి మాట్లాడుకోగానే మొదట గుర్తుకు వచ్చేది హీరోయిన్ సాయి పల్లవి.

నిజంగా తీసినవే.. ఏఐ ఫొటోలు కాదు.. బికిని ఫొటోలపై సాయి పల్లవి క్లారిటీ
X

దిశ, సినిమా : పద్ధతైన పాత్రలు, అద్భుతమైన డ్యాన్సులు, క్లాసీ లుక్ వీటి గురించి మాట్లాడుకోగానే మొదట గుర్తుకు వచ్చేది హీరోయిన్ సాయి పల్లవి. సాంప్రదాయ లుక్‌లో కనిపిస్తూ కోట్లాది మంది ఫ్యాన్స్‌ను తన సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి సంబంధించి లేటెస్ట్‌గా బికిని ఫొటోలు వైరల్ అయ్యాయి. తన సోదరితో విదేశాలకు వెకేషన్‌కు వెళ్ళిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. బికినీ ధరించినట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు.. తలలు పట్టుకుంటున్నారు.

ఇవి నిజమైన ఫొటోలు కాకపోవచ్చు, AI ద్వారా క్రియేట్ చేసినవి కావచ్చు అంటూ భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా వీటిపై ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇస్తూ సాయి పల్లవి ఓ పోస్ట్ పెట్టింది. ట్రిప్‌కు సంబంధించిన పూర్తి వీడియోను షేర్ చేస్తూ.. ‘పైన కనిపిస్తున్నవన్నీ నిజంగా తీసిన ఫొటోలు.. ఏఐ ఫొటోలు కాదు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో.. ఆమె షేర్ చేసిన వీడియోలో బికిని ఫొటోలు లేకపోవడంతో.. బికిని ఫొటోలు ఏఐవి.. ఇప్పుడు తను షేర్ చేసినవి నిజమైనవి అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె బికిని ధరించలేదు అని క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. లింక్

Next Story