నాని సరసన మరోసారి ఆ బ్యూటీఫుల్ హీరోయిన్.. ఈసారి కూడా హిట్ పక్కా అంటున్న నెటిజన్లు

by Chukka Sudharani |

నేచురల్ స్టార్ నాని (Nani) ఇటీవల ‘హిట్-3’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నాడు.

నాని సరసన మరోసారి ఆ బ్యూటీఫుల్ హీరోయిన్.. ఈసారి కూడా హిట్ పక్కా అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) ఇటీవల ‘హిట్-3’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ఆకట్టుకోగా సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అలాగే.. నాని, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. ఇప్పుడు ఈ మూవీ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నేచురల్ స్టార్ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించకముందే మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టాడు నాని. ఇందుకోసం ఈసారి డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula)తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘కుబేర’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల నాని కోసం ఎలాంటి కథ సిద్ధం చేశాడా అని ఆడియన్స్‌లో క్యూరియాసిటీ నెలకొంది.

పైగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న తొలి చిత్రం కావడంతో.. ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో శేఖర్ కమ్ముల, నాని కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా సాయి పల్లవి(Sai Pallavi)ని ఫిక్స్ చేసే పనిలో పడ్డారట మేకర్స్. అలాగే.. ఇప్పటికే సాయి పల్లవి, నాని కాంబోలో వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ కాంబోనే ఫిక్స్ చేద్దాం అని గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ కావడంతో.. అయితే ఈసారి కూడా హిట్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story