Sai Pallavi : క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్‌గా సాయి పల్లవి

by Chukka Sudharani |   (  Updated:2024-11-05 14:21:17  IST  )

నాగచైతన్య (Naga Chaithanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’( Thandel Movie).

Sai Pallavi : క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్‌గా సాయి పల్లవి
X

దిశ, సినిమా: నాగచైతన్య (Naga Chaithanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’( Thandel Movie). చందూ మొండేటి (chandoo modenti) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రేమికుల రోజు(Lover's Day) కానుకగా.. ఈ లవ్ అండ్ ఎమోషనల్ సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే నేచురల్ బ్యూటీ సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘సాయి పల్లవి నటించిన ‘అమరన్’(Amaran) చిత్రం తాజాగా చూశాను. అందులో పల్లవి అందరిని ఏడిపించేసింది. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు నా కంట్లో కూడా నీళ్లు తిరిగాయి’ అని తెలిపి.. సాయి పల్లవి నాకు కూతురు లాంటిది అని చెప్పుకొచ్చారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘సిల్వర్ స్క్రీన్ కూడా గోల్డెన్ స్క్రీన్ చేసే సత్తా సాయి పల్లవికి ఉంది. అందుకే ఆమె మా క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్’ అని ప్రశంసించాడు. ఇక వీళ్ల కామెంట్స్‌పై స్పందించిన సాయి పల్లవి.. ‘వీళ్లు సరదాగా నన్ను ఆట పట్టించడానికి క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్ అని పిలుస్తారు. కానీ ఏది చెయ్యాలి అన్నా అది ప్రేక్షకుల చేతిల్లో ఉంటుంది. ‘అమరన్’ చిత్రానికి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన మీ అందరికి చాలా థాంక్యూ. అలాగే ‘తండేల్’ కు కూడా మంచి సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సాయి పల్లవి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Read More..

Sai Pallavi: తండేల్ ప్రెస్‌మీట్‌లో సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్..!!

Next Story