టాలీవుడ్ హీరోకు సాయి కుమార్ కు వార్నింగ్‌..స్టేజ్ పైనే !

by velandi.Saikiran |

హీరో ఆది అలాగే కిరణ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని, పొగుడుతున్న సందర్భంగా తనకేమీ

టాలీవుడ్ హీరోకు సాయి కుమార్ కు వార్నింగ్‌..స్టేజ్ పైనే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ కుర్ర హీరో ఆదికి సాయికుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చూడడం ఏంటని స్టేజ్ పైనే తన ఆదిని కడిగేశారు. హీరో ఆది చేస్తున్న లేటెస్ట్ మూవీ శంబాల. ఈ సినిమాను యుగంధర్ మునీ చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. మహీధర్ రెడ్డి, అన్నాభీమోజు ఇద్దరు ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హీరో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ హీరోయిన్ గా మెరుస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీన ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

తాజాగా ట్రైలర్ కూడా వదిలింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ అత్యంత భయంకరంగా సీన్స్ ఉన్నాయి. అంతేకాకుండా చాలా ఇంట్రెస్ట్ గా కథను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అయితే క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ కుర్ర హీరోలు అందరూ వచ్చారు. అయితే కే ర్యాంప్ హీరో కిరణ్ అబ్బవరంను ఉద్దేశించి పొగుడుతూ సాయికుమార్ మాట్లాడారు.

హీరో ఆది అలాగే కిరణ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని, పొగుడుతున్న సందర్భంగా తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించాడు హీరో ఆది. మొబైల్లో రీల్స్ చూస్తూ స్టేజ్ పైనే సాయికుమార్ కు కోపం తెప్పించాడు ఆది. ఇది చూసిన సాయికుమార్ వెంటనే ఆగ్రహానికి గురై, ఆది ఏం చేస్తున్నావ్ ? అని గట్టిగా అరిచాడు. దీంతో వెంటనే అలెర్ట్ అయ్యాడు ఆది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. క్లిక్

Next Story