- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sai Durga Tej: తల్లి చేతుల మీదుగా అవార్ట్...సాయి దుర్గ తేజ్ ట్వీట్
పిల్లా నువ్వు లేని జీవితం సినిమా హిట్ అయిన తర్వాత వచ్చిన అవార్డును తన తల్లి చేతుల మీదుగా అందుకున్నాడు. సాయి దుర్గ తేజ్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సాయి దుర్గ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో కుర్ర హీరో. 2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో ఇండస్ట్రీని దున్నేసిన సాయి దుర్గ తేజ్, మొన్న విరూపాక్షతో బంపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు SYG ( సంబరాల ఏటి గట్టు) అనే యాక్షన్ డ్రామాతో రాబోతున్నాడు. అయితే తాజాగా సాయి దుర్గ తేజ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తన తల్లి చేతుల మీదుగా రెండుసార్లు అవార్డు అందుకున్న ఫోటోను షేర్ చేశాడు.
పిల్లా నువ్వు లేని జీవితం సినిమా హిట్ అయిన తర్వాత వచ్చిన అవార్డును తన తల్లి చేతుల మీదుగా అందుకున్నాడు. అలాగే కొన్ని రోజుల కిందట హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి సాయి దుర్గ తేజ్ గురైన సంగతి తెలిసిందే. అయితే ఆ రోడ్డు ప్రమాదం తర్వాత మరో అవార్డును దక్కించుకున్నాడు సాయి దుర్గ తేజ్. ఆ అవార్డును కూడా తన తల్లి చేతుల మీదుగానే అందుకున్నాడు. ఇలా రెండు అవార్డులను తన తల్లి చేతుల మీదుగా అందుకోవడం అదృష్టం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇది ఎన్నో జన్మల పుణ్యం అంటూ పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. క్లిక్






