‘కుమ్మేయాలి బాబాయ్.. నీ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా’.. మంచు హీరోకు మెగా హీరో సపోర్ట్

by Chukka Sudharani |   (  Updated:2025-05-28 15:27:07  IST  )

మంచు హీరో మనోజ్ (Manchu Manoj) ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు.

‘కుమ్మేయాలి బాబాయ్.. నీ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా’.. మంచు హీరోకు మెగా హీరో సపోర్ట్
X

దిశ, సినిమా: మంచు హీరో మనోజ్ (Manchu Manoj) ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే మనోజ్ రీ ఎంట్రీపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) స్పందిస్తూ.. తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ‘బాబాయ్... వ్యక్తిగత కారణాల వల్ల నటన/సినిమాలకు దూరంగా ఉండాల్సి రావడాన్ని నువ్వు ఎప్పుడూ ఇష్ట పడలేదు. నువ్వు చేసిన త్యాగాలు నాకు తెలుసు.. నీ శక్తిని, స్క్రీన్ ప్రెజెన్స్‌ను నేను ఎప్పుడూ మెచ్చుకున్నాను.

నా బ్రదర్ నువ్వు ఎప్పుడు అంతకంతకూ పెరుగుతూ, రోజురోజుకూ మెరుగుపడుతూనే ఉంటావు. తెరపై నిన్ను నేను నిజంగా మిస్ అవుతున్నాను బ్రదర్. నువ్వు మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తావని నేను ఎప్పుడో నమ్మాను. అలాగే నువ్వు ఎప్పుడు కమ్ బ్యాక్ ఇస్తావో కూడా నాకు తెలుసు.. నా ప్రియమైన బాబాయ్, నా స్నేహితుడు, నా సోదరుడు, నువ్వు నాకు కుటుంబం కంటే ఎక్కువ మనోజ్. నీ కమ్ బ్యాక్‌కు శుభాకాంక్షలు డియర్ మనోజ్.. కుమ్మేయాలి బాబాయ్... బిగ్ స్క్రీన్‌పై నీ పిచ్చిని చూడటానికి నేను వేచి ఉండలేను’ అంటూ సాయి ధరమ్ తేజ్ మనోజ్‌తో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story