- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్-అట్లీ సినిమా కోసం సాయి అభ్యంకర్ సరికొత్త సౌండింగ్
'AA22xA6' టీజర్‌కు సరికొత్త సౌండ్ అందించేందుకు శ్రమిస్తున్న సాయి అభ్యంకర్.

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ఇంకా అధికారిక టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. అందుకే తాత్కాలికంగా 'AA22xA6' అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ కొనసాగుతోంది. ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆ టీజర్ కోసం ప్రత్యేక పనులను మూవీ బృందం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్‌లో మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచేలా సరికొత్త సౌండ్ డిజైన్‌పై ఆయన ప్రత్యేకంగా పని చేస్తున్నట్లు సమాచారం. అలాగే అల్లు అర్జున్, అట్లీ కూడా ఈ టీజర్‌కు కొత్త తరహా సౌండింగ్ తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ భారీ చిత్రంలో దీపికా పదుకోనె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అనుష్క శర్మ కూడా ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






