- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సారంగపాణి జాతకం’ వాయిదా.. సమ్మర్ ట్రీట్ గ్యారంటీ అంటూ రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీ మేకర్స్
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి(Priyadarshi) ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు ప్రియదర్శి(Priyadarshi) ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. టాలీవుడ్ హీరోలందరి చిత్రాల్లోనూ నటించిన ఆయన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. విభిన్న కథలతో వచ్చిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘బలగం’(Balagam) సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. ఎంతోమంది ఈ కాన్సెప్ట్‌కు కనెక్ట్ అవడంతో ‘బలగం’ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. దీని తర్వాత ప్రియదర్శి ఓం భీమ్ బుష్, డార్లింగ్ వంటి సినిమాలు చేశారు కానీ హిట్ అందుకోలేకపోయారు. ప్రజెంట్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సారంగపాణి జాతకం’(SarangapaniJathakam).
ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti)దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియదర్శి సరసన రూప కొడువాయూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ‘సారంగపాణి జాతకం’ మూవీ విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్18న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
అదే రోజున కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా కూడా రిలీజ్ కాబోతుండటంతో మూవీ మేకర్స్ కాస్త వెనకడుగు వేసినట్లు టాక్. ఇక ‘సారంగపాణి జాతకం’ వాయిదా పడినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుపుతూ కొత్త రిలీజ్‌ను ప్రకటించారు. ‘సారంగపాణి జాతకం’ ఏప్రిల్ 25న థియేటర్స్‌లో రాబోతున్నట్లు తెలుపుతూ ప్రియదర్శి పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘అన్ని వయసుల వారిని అలరించే అచ్చమైన తెలుగు చిత్రం సారంగపాణి జాతకం మీ ముందుకు రాబోతుంది. ప్రేక్షకులకు సమ్మర్ ట్రీట్ ఇవ్వడం గ్యారంటీ’’ అనే క్యాప్షన్ జత చేశారు.






