- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
S. S. Karthikeya: వారణాసిలోని 20 నిమిషాల సీక్వెన్స్‌ను ఆ ఇన్స్పిరేషన్‌తో చిత్రీకరించాం
ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడుతూ... వారణాసి చిత్రంలోని ఓ 20 నిమిషాల సన్నివేశాన్ని రామాయణం నుండి ప్రేరణ తీసుకుని చిత్రీకరించాం అని వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం “వారణాసి”. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్‌ను ఎస్.ఎస్. కార్తికేయ తెలియజేశారు. కార్తికేయ మాట్లాడుతూ, “వారణాసి చిత్రంలోని ఓ 20 నిమిషాల సన్నివేశాన్ని రామాయణం నుండి ప్రేరణ తీసుకుని చిత్రీకరించాం” అని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కే.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.






